నా స్ఫూర్తి ప్రధాతను గుర్తు చేసుకుంటున్నా: చిరంజీవి

సుదీర్ఘ కాలంపాటు భారత దేశంలో మిషనరీస్ అఫ్ ఛారిటీని, ప్రపంచo అంతా వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసిన మానవతా మూర్తి మదర్ థెరీసా. బుధవారం మదర్ థెరీసా 110వ జయంతి కాగా, మెగాస్టార్ చిరంజీవి ఆమెని గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి తన ట్విట్టర్‌లో .. `మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికెళ్తే అక్కడ ప్రేమను పంచాలి` అని మదర్ థెరీసా మాటలని గుర్తు చేసుకుంటూ.. మదర్ థెరీసా 110వ జన్మదినోత్సవం సందర్భంగా గొప్ప మాతృమూర్తిని, నా స్ఫూర్తి ప్రధాతను గుర్తు చేసుకుంటున్నా. ఆమె సూచించిన స్వార్థరహిత ప్రేమ, మానవత్వం ఈ ప్రపంచానికి అవసరం` అని చిరంజీవి పేర్కొన్నారు.