గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన తనికెళ్ళ భరణి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ నటుడు తనికెళ్ళ భరణి తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ భరణి శ్రీనగర్ కాలనీ లోని తన నివాసంలో లో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు హరిత యజ్ఞం రూపంలో మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం మరో నలుగురు సుహాసినీమణిరత్నం, డైరెక్టర్ త్రివిక్రమ్, సినీ నటులు నాజర్ మరియు ప్రకాష్ రాజ్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసురుతున్నట్లు వారు దీనిని స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.