డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో అక్రమ కనెక్షన్ల తొలగింపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం చింతలమోరి గ్రామం పొడితోటలో నీటి సమస్య అధికమవడంతో అక్రమంగా వేసుకున్న మోటార్ కనెక్షన్ పైపులను చింతలమోరి సర్పంచ్, రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ కొల్లు ప్రకాష్ మరియు జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి మనోహర్, సిద్దయ్య, సంఘం ప్రెసిడెంట్ నల్లి బాబురావు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్ల, సంఘ పెద్దలు పర్యవేక్షణలో మోటర్ పైపులను తొలగించడం జరుగుతుంది.

  • రోడ్లకిరువైపుల చెత్త తొలగింపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం మండలం, చింతలమోరి గ్రామం పొడితోటలో రోడ్లకు ఇరువైపుల పెరిగిపోయిన చెట్లను, చెత్త మొక్కలను, కరెంటు స్తంభాల దగ్గర పరిసరాలను చింతలమోరి సర్పంచ్ మరియు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ కొల్లు ప్రకాష్ మరియు జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఓగూరి మనోహర్, సిద్దయ్య, సంఘం ప్రెసిడెంట్ నల్లి బాబురావు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, సంఘ పెద్దల పర్యవేక్షణలో పరిశుభ్రం చేయడం జరిగింది.

చిట్టూరి నాగేశ్వరరావును పరామర్శించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గరువు గ్రామని చెందిన చిట్టూరి నాగేశ్వరరావు తల్లి కాలం చేసారు. వారి కుటుంబ సభ్యులను కలసి రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జనసేన నాయకులు కొనతం నరసింహరావు, గ్రామశాఖ అధ్యక్షులు బోణం రాజు, ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి దుర్గాప్రసాద్, రాపాక మహేష్, బల్ల రాము, పిల్లి శ్రీను, గుబ్బల సురేష్, చిట్టూరి శేఖర్ తదితరులు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సానుభూతి తెలియచేయడం జరిగింది.