జనసేన ఆధ్వర్యంలో తుప్పల తొలగింపు

తుని, బెండపూడి గ్రామ పంచాయితీ తమ్మయ్యపేట గ్రామంలో గల స్మశాన వాటికలో ఉన్న తుప్పలను తొలగించాలని జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు కోరుకొండ శివ మరియు అయ్యప్ప ఇతర జనసైనికులు పంచాయతీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి స్పందన రాకపోవడంతో స్వయంగా జనసేన పార్టీ నాయకుల పరిరక్షణలో వాటిని తొలగించడం జరిగింది. దీనితో తమ్మయ్యపేట గ్రామస్తులు జనసేన పార్టీ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు.