గుడికి, బడికి మధ్య ఉన్న మద్యం షాపు తొలగింఛండి: జనసేన వీరమహిళల ధర్నా

రాజంపేట మండలం పరిధిలోని భువనగిరి పల్లె వద్ద గుడికి, బడికి మధ్య ఉన్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని జనసేన వీర మహిళలు జనసేన నాయకులు ఈ ఆదివారం ధర్నా చేపట్టారు అక్కడికి చేరుకున్న పోలీసులు ధర్నాకు అనుమతి లేదని నిరసనకారులకు స్పష్టం చేశారు. దీంతో కొద్దిసేపు మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యని పరిష్కరిస్తామని ఎస్సై లక్ష్మీ ప్రసాద్ తెలియజేశారు.