‘వకీల్ సాబ్’ పై రేణు దేశాయ్ కామెంట్స్…!

వకీల్ సాబ్ ట్రైలర్‌ పై రేణు దేశాయ్ ఊహించని వ్యాఖ్యలు చేసింది. వకీల్ సాబ్ ట్రైలర్ చూసి తన మనసులో మాట చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారని, ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడని పవర్ స్టార్ ఈ ట్రైలర్ లో కనిపించారని తెలిపింది. ట్రైలర్‌ లో పవన్ ఆటిట్యూడ్ అదిరిపోయిందని రేణు దేశాయ్ ప్రశంసించింది. అమ్మాయిల తరఫున నిలబడి పోరాడే న్యాయవాది పాత్రలో పవన్ చాలా బాగా కనిపించారని, న్యాయం కోసం పోరాడే పాత్ర పవన్ కు చాలా బాగుంటుందని చెప్పింది. ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుందని, మొదటి నుంచి చివరి వరకు కూడా వకీల్ సాబ్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని రేణు దేశాయ్ కామెంట్స్ చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.