కరోనా కష్టకాలంలో రేణు దేశాయ్.. తన వంతు సాయం!

కరోనా కష్టాల్లో తనవంతుగా సాయం అందించేందుకు నటి రేణు దేశాయ్ ముందుకు వచ్చారు. ఆమె ఈ విషయాన్ని తన ఇన్‏స్టా‏గ్రామ్ ద్వారా తెలిపారు. ఈ కష్ట కాలంలో ప్లాస్మా, బెడ్స్, ఆక్సిజన్, మందులు ఇలా ఎలాంటి అవసరం ఉన్నా తనకు మెసేజ్ చేయాలని రేణుదేశాయ్ పేర్కొన్నారు. ఆమె వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ప్రస్తుత పరిస్థితులలో సోషల్ మీడియాలో కేవలం సినిమా ప్రమోషన్లకు మాత్రమే కాకుండా.. ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించడాన్ని ఆమె ప్రశంసించారు. తాను కూడా తనకు తోచిన సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు రేణుదేశాయ్. తన ఇన్ బాక్స్ ని ఓపెన్ చేసి ఉంచుతానని.. అనవసరమైన మెసేజ్ లు కాకుండా అవసరంలో ఉన్నవాళ్ళు తనకు మెసేజ్ చేయాలని రేణు దేశాయ్ కోరారు.