మున్నాభాయ్ త్వరగా కోలుకోవాలి అని ట్వీట్ చేసిన శంకర్ దాదా

సంజయ్ దత్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసి చాలా బాధనిపించిందని చిరంజీవి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రియమైన సంజయ్ దత్ భాయ్‌కి అంటూ ఓ ట్వీట్ చేసిన చిరంజీవి… మీరు ఓ పోరాట యోధుడు అని కొనియాడారు. ఇన్నేళ్లకాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, ఈసారి కూడా మీరు ఈ కష్టాన్ని దాటుకుని విజయంతో తిరిగొస్తారని ఆశిస్తున్నానని చిరు తన ట్వీట్ ద్వారా తన ఆకాంక్షను వ్యక్తపరిచారు. మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.