నందిగామ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జనసేన పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల అధ్యక్షులు మరియు నాయకులు జనసైనికులు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిగామ మండల అధ్యక్షుడు పి రామారావు, కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్, వీర్లపాడు మండల అధ్యక్షులు బేతంపూడి జయ రాజు, చందర్లపాడు మండల అధ్యక్షుడు వడ్డేపల్లి సుధాకర్, నందిగామ పట్టణంలో 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ పాల్గొనటం జరిగింది.