టీం జనసేన వైకోట ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

వైకోట, టీం జనసేన వైకోట ఆధ్వర్యంలో 73వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, వైకోట గ్రామపంచాయతీలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో, మండల పరిషత్ ఆదర్శ స్కూల్ లో, జ్ఞానంకొండ నాగేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మరియు సిధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ జెండాను ఎగురవేసి భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ కి ఘననివాళులు అర్పించి నేటి బాలలే రేపటి పౌరులు అని గుర్తు చేస్తూ వారికి మన మహానుభావులందరి గురించి పిల్లలకు తెలియచేసి వేడుకల్ని ఘనంగా నిర్వహించి స్కూల్ లోని పిల్లలందరికీ స్వీట్లు పంచారు.