విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ పాలవలస యశస్వి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి యశస్వి పూలమాల వేసి వేడుకల్ని ప్రారంభించి, ఆమె చేతులమీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినిలు దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు యశస్వి మాట్లాడుతూ దేశమంతా కులమతాలకు అతీతంగా జరుపుకునే పెద్ద పండుగ గణతంత్ర దినోత్సవమని, భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవిస్తూ, దేశసమగ్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ భారతీయుడుపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత విభాగ రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్విని, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి, హుస్సేన్ ఖాన్, మజ్జి శివ శంకర్, చెల్లూరి ముత్యాల నాయుడు తాటిపూడి రామకృష్ణ, కిలారి ప్రసాద్, కొవ్వాడ సతీష్, విశ్వ, సాయి కిరణ్, కౌసల్య, గౌతమ్, ఆ.శివ గణేష్, ఎం సీర కుమార్, నవీన్, సాయి, పండు తదితరులు పాల్గొన్నారు.