కరోనాతో వైద్యులపై గౌరవం పెరిగింది: ప్రధాని మోడీ

వైద్య విద్యలో పారదర్శకత పాటిస్తున్నామని ప్రధాని వెూదీ అన్నారు. డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ కాన్వొకేషన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కరోనాతో వైద్యులపై గౌరవం ఇనుమడించిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇంత వరకూ 50శాతం ఎంబీబీఎస్, 80శాతం పీజీ సీట్లను పెంచినట్లు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు అంటే గత ఆరేళ్లలో 30వేలకు పైగా ఎంబీబీఎస్‌ సీట్లు, 24వేల పీజీ సీట్లు పెంచామని వివరించారు. దేశంలో కొత్తగా 15 ఎయిమ్స్‌లకు అనుమతులు ఇచ్చామన్నారు.