క్లినికల్ ట్రయల్స్ పునః ప్రారంబం

ఆస్ట్రాజెనెకా కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్ కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)… సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు అనుమతి ఇవ్వడంతో తన దశ రెండు మరియు మూడు క్లినికల్ ట్రయల్స్ ను తిరిగి మొదలు పెట్టింది. ఫార్మా మేజర్ డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (డిఎస్‌ఎమ్‌బి), యుకె మరియు డిఎస్‌ఎమ్‌బి ఇండియా సిఫారసులను సమర్పించిన తరువాత…

ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న టీకా క్లీనికల్ ట్రయల్స్ ని మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ కూడా అనుమతి ఇచ్చారు. డిసిజిఐ… విజి సోమాని, ఎస్ఐఐకి రాసిన లేఖలో క్లీనికల్ ట్రయల్స్ ని తిరిగి మొదలు పెట్టాలి అని కోరారు. ఆగస్టు 2, 2020 నాటి క్లినికల్ ట్రయల్ ను తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. స్క్రీనింగ్ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.