పునః ప్రారంబమైన మథుర మీనాక్షమ్మదర్శనం

కోవిడ్-19 నేపథ్యంలో 165 రోజుల మూతపడిన మధురైలోని విూనాక్షి అమ్మన్‌ ఆలయం మంగళవారం తిరిగి తెరుచుకుంది. తొలిరోజు అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భౌతికదూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేముందే ఆలయ సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేశారు. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకొని, మాస్కులు ధరించిన వారినే దర్శనానికి అనుమతించారు.