శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో, శ్రీశైలం డ్యామ్ కు పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 36,207 క్యూసెక్కుల నీరు వస్తుండగా… ఔట్ ఫ్లో 26,839 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 822.70కి చేరుకుంది.

శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటి నిల్వ స్థాయి 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం జలాశయంలో 42.8708 టీఎంసీల నీరు ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో (తెలంగాణ) విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా.. కుడిగట్టు (ఏపీ) విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభం కాలేదు.