రహదారి మరమ్మత్తులు చేపట్టాలి: జనసేన డిమాండ్

నూజివీడు: లీలనగర్ అడ్డరోడ్డు వద్ద రోడ్డు మీద మార్జిన్ ల వద్ద పడిన గండి పడిన రోడ్డును బాగు చేసి, దిగవల్లి రోడ్డులో వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రమాదాలను అరికట్టాలని నూజివీడు సబ్ కలెక్టర్ కు అర్జీ అందచేసిన నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు. నూజివీడు నుండి వలసపల్లి వెళ్ళే ప్రధాన అర్ అండ్ బి రోడ్డు మర్మత్తులు, లీలానగర్ అడ్డ రోడ్డు వద్ద రోడ్డు ఇరు వైపుల లోతైన గండి పడి ప్రమాదకరంగా మారడంతో అధికారులు పట్టించుకోకపోవడం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అలానే అదే రోడ్డులో దిగవల్లి వద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు సబ్ కలెక్టర్ గారికి తెలుపుతూ స్పందనలో అర్జీ అందచేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు జనసేన నాయకులు తోట వెంకట్రావు, సురిశెట్టి శివ, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్, గాంధీ, సాయి చరణ్, సతీష్ పాల్గొన్నారు.