ఘర్జించే జనసేన జెండా

తెల్ల తెల్లాని జెండా…. తెలుగోడి జెండా’ అంటూ సాగే పాటను ఈ పాటను సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాయగా, అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు. ‘గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.. తెల్లా తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా.. ఎర్రటి గుండెల జెండా’ అంటూ ‘జెండా పట్టు ఎర్రటి గుండెల జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా’ అంటూ సా గు తో న ్న జెండా పాట ప్రతి జనసైనికుని అలరిస్తోంది.

జ న సే న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనకు ఎటువంటి మత,కుల,జాతి విపక్ష ఉండదని,తాను ఎప్పుడు ఒక సగటు దేశభక్తి కలిగిన భారతీయుడినేనని చాలా సందర్భాలలో చెప్పారు. ఇదే సూత్రం తో తాను పార్టీపెట్టానని తెలిపారు. కులాలను కలుపుకుపోవడం,మతాల గురుంచి ప్రస్తావించకపోవడం,ప్రతి భాష,సంస్కృతిని గౌరవించడం,ప్రాంతాలను గౌరవించు జాతీయ వాదం, ప్రకృతినెపుదు ప్రేమించే ప్రగతి నినాదం,అవినీతితో ఎల్లపుడూ అలుపెరుగని యుద్ధం చేయడం వంటి జనసేన 7 సిద్ధాంతాలను సామాన్యునికి చేరేలా సాహిత్యం ఉంది.

జనసేన జెండా సగటు కి మనోధైర్యం కలిగిస్తుందని,అంబేద్కర్ పూలే వంటి వారి ఆశయాలు నేరవేర్చతంలో ముందుంటుందని, అణగారిన వర్గాల ప్రజలకు ఎప్పుడు తోడుగా వారి ఆశలను నేరవేర్చే దిశగా జనసేన అడుగులు వేస్తుందని, దేశ ప్రజల శ్రేయస్సు కోసం పరితపించిన భగత్ సింగ్,ఝాన్సీ లక్ష్మీభాయ్,ఆజాద్,సుభాష్
చంద్రబోస్ వంటి వారి స్పూర్తితో ప్రజల శ్రేయస్సు ఎక్కడా వెనకాడకుండా జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసారు. చివరి కొసమెరుపుగా భరతమాత మెడలో ఇదే మెరిసే దండ అంటే ఎల్లప్పుడూ జనసేన దేశ శ్రేయ్యస్సుపై పాటుపడుతూ ఉంటుందని ఈ జెండా పాటలో తెలియచేశారు. జెండా పాటలో తెలియచేశారు.
ఓ పత్రికాధినేత ‘జెండా పీకేద్దామా?’ అంటూ ప్రజారాజ్యం పార్టీ పై విషం చిమ్మడం అప్పట్లో చాలా చర్చనీయాంశమయ్యింది. అయితే ఆనాటి రాజకీయ పరిస్థితులు, భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలో వాస్తవ రాజకీయాల్లో రంగులు ఎలా మారిపోతాయో, ఎవరి వెనుకాల ఎలాంటి కుట్రలు దాగి వుంటాయో రంగంలోకి దిగాకగానీ చిరంజీవి తెలుసుకోలేకపోయారు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ జెండాని రాజకీయ ప్రముఖులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు’ పీకేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయిగానీ, ఇప్పుడు జనసేన విషయంలో అలా కుదరదు. రాజకీయ పరిస్థితుల్ని పవన్కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించారు, అర్థం చేసుకున్నారు. ‘అవసరమైతే ఇంకా ఇంకా నేర్చుకుంటాను’ అని పవన్ చెబుతున్న మాటల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఓ తప్పుడు మాటని పదిసార్లు చెబితే అదే నిజమవుతుందనే భావనలో వున్న కొందరు రాజకీయ నాయకులు ఎంత మొరిగిన జనసేన జెండా రెప రెప పాడటం కాయం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క సీటు గెలిచినా, ప్రజలతోనే వుంటాం.. అని జనసేన తప్ప ఏ రాజకీయ పార్టీ ధైర్యంగా చెప్పగలిగింది ఇప్పటిదాకా? గుండె మీద చెయ్యేసుకుని జనసేన అభ్యర్థులు ‘మేం ఎన్నికల్లో డబ్బు పంచలేదు’ అని చెప్పగలరు.. ఆ ధైర్యం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పగలరా? అవకాశమే లేదు.

ప్రజలు అధికారమివ్వలేదన్న అక్కసుతో అసెంబ్లీకి రావటానికి ఇష్టపడని వైఎస్ జగన్, సిఎం అయ్యేవరకు అసెంబ్లీకిఅడుగుపెట్టను అని ఇంకో బ్లాక్మెయిల్ చేసే చంద్రబాబు.. వీళ్ళిద్దరికీ వంత పాడే మీడియా సంస్థలు వెరసి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు మాత్రం ఎవరికీ పట్టడంలేదు. జనసేన అధికారంలోకి వస్తుందా? రెండు మూడు సీట్లకే పరిమితమవుతుందా.? లేదంటే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందా? అనే అంశాలు జనం
డిసైడ్ చేస్తారు. మార్పు కోసమంటూ ఓ ప్రయత్నం చేస్తున్న పవన్ని సమర్థించకపోయినా ఫర్వాలేదు, అలాంటి మార్పుకి మీడియా సంస్థలు అడ్డుపడకుండా వుండాలి.
జనం తిరస్కరిస్తే, జనసేనకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. అయినా, సినిమాల్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన పవన్, తిరిగి సినీ జీవితంలో రాణించడం పెద్ద కష్టం కాదు. అది అన్న చిరంజీవి చేసి చూపించారు. ఖరీదైన జీవితాన్ని వదిలేసి, జనం కోసం కష్టనష్టాల నడుమ మార్పు కోసంప్రయత్నిస్తున్న పవన్కళ్యాణ్ని విమర్శించే నైతిక హక్కు, అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికెక్కడిది.? మార్పు మొదలైతే, ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలు తారుమారైపోతాయ్. అందుకే జనసేన జెండా చూస్తే అంత భయం. ఆ జెండా ఎగరకుండానే మట్టుబెట్టా లనే కుటిల ప్రయత్నాలు మానుకుని, ప్రజల కోసం ఆలోచిస్తే మంచిదేమో!

కులాలను కలిపే జెండా, మతాల మాట ఎత్తని జెండా ఏదో ఒక రోజు రెప రెప లాడటం కాయం.