వైసీపీ బడాయి మాటలకు కౌంటర్ ఇచ్చిన రోసనూరు సోమశేఖర్

సూళ్ళూరు పేట, చింత చచ్చినా పులుపు చచ్చినట్లు లేదు ఈ వైసీపీ పార్టీ శ్రేణులు కొంతమందికి అంటూ అన్ని లక్షల మంది మార్పుని కాంక్షిస్తూ ఓట్ల రూపంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ వైసీపీ పాలనని వ్యతిరేకిస్తూ చిత్తుచిత్తుగా ఓడించినా ఇంకా జ్ఞానోదయం వచ్చినట్లు లేదు అని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ అన్నారు. రోజుకి 10 నుంచి 20 రూపాయలు ఇస్తూ సంక్షేమం అధ్బుతం అంటూ నిరుపేద ప్రజలను మభ్య పెట్టే మాటలు కట్టి పెట్టాలి అంటూ వాపోయారు. పేటియం 5 రూపాయల కథలు మాని ఉన్న ఈ కొన్ని మాసాలైనా పరిపాలనపై దృష్టి పెట్టాలని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే మంచిదని తెలియజేశారు. వై నాట్ 175 లాంటి బడాయి మాటలు విని ప్రజలు నవ్వుకునే స్థాయికి దిగజారారు, 175 లో ఉన్న 7 కాని 5 కాని తీస్తే వచ్చేవే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దిక్కుమాలిన పాలన చేస్తున్న వైసీపీకి వచ్చే సీట్లు అని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇకనైనా అసత్య ప్రచారాలు, బడాయి మాటలు తగ్గించి గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉండడం ఉత్తమం అని, 2019 లో కష్టపడిన వైసీపీ కార్యకర్తలను ముందు కాపాడుకోండి అని వైసిపిని ఉద్దేశించి సోమశేఖర్ మాట్లాడారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఎందుకు అన్నారో వైసీపీ వారికి ఇప్పటికైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థమై ఉండాలి, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫలితాలే వైసీపీకి వస్తాయి అని తెలిపారు. టిడిపి వారు కూడా మీ గెలుపుకు కారణం మీ బలం మాత్రమే కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని జనసేన తరఫున తెలియజేసారు.