RRR సెకండ్ సాంగ్ రిలీజ్… చరణ్‌, ఎన్టీఆర్‌ ‘నాటు’ డ్యాన్స్‌ అదుర్స్!

సంగీత అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మాస్‌ ఆంథమ్‌ ‘నాటు నాటు’ వచ్చేసింది.

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. సినిమాలోని రెండో పాటైన ‘నాటు నాటు’ (లిరికల్‌ వీడియో)ను విడుదల చేసింది. ‘నా పాట సూడు.. నా పాట సూడు.. వీర నాటు నాటు…’ అంటూ సాగే ఈ సాంగ్‌లో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దోస్తీ’కి విశేష స్పందన లభించింది.

ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. ఆలియా భట్‌, శ్రియ, సముద్రఖని, ఒలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు.