RRR: రామరాజుగా రౌద్రం చూపించిన రామ్ చరణ్..!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’గా కనిపించనున్నాడు. రేపు (మార్చ్ 27) చరణ్ బర్త్ డే కావడంతో ఒకరోజు ముందుగానే ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ రెడీ చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ ని లుక్ ను విడుదల చేసింది.అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్న రామ్ చరణ్ ఆకాశంలోకి విల్లు ఎక్కుపెట్టి రౌద్రాన్ని చూపిస్తున్నాడు. అతని పాత్రకు తగ్గట్టే అగ్నిలో కనిపించేలా ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. థియేటర్స్ లో అల్లూరి గర్జన ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పాడానికి ఇదొక చిన్న శాంపిల్ అని అర్థం అవుతోంది. ఇక రామరాజు పాత్రలో చరణ్ ఒడిగిపోయినతనట్లు కనిపిస్తోంది. చెర్రీ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ పోస్టర్ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల కానుంది.

కాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్.. రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ – నేషనల్ అవార్డ్ గ్రహీత సముద్రఖని – శ్రీయా శరణ్ – హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్ – అలిసన్ డూడీ తదితరులు ఇతర ప్రధాన ప్రాతలు పోషించారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.