పట్టాలెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’

కరోనా నేపధ్యంలో లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. అన్ లాక్ 4లోభాగంగా  కేంద్రం షూటింగులకు అనుమతినివ్వగా.. సెప్టెంబర్ నుంచి టాలీవుడ్‌లో షూటింగుల సందడి ప్రా రంబమయ్యింది.. కొంతమేర బ్యాలెన్స్ ఉన్న సినిమాలు పట్టాలెక్కాయి.

అయితే ఇప్పుడు అందరిచూపు ‘ఆర్ఆర్ఆర్’ వైపే ఉంది. జక్కన్న సగం చెక్కిన ఆర్ఆర్ఆర్ శిల్పాన్ని తిరిగి చెక్కడం ఎప్పుడు మొదలు పెడతాడా అని.. ఎందుకంటే ఈ సినిమా కారణంగా హీరోలు, నిర్మాతలు, దర్శకుల ఫ్యూచర్ ప్రాజెక్టులపై విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఇంకా లేట్ చేస్తే ఎన్టీఆర్, చరణ్ తర్వాతి సినిమాల మీద కూడా ప్రబావం పడుతుంది. రిలీజ్ సంగతి ఏమోకానీ ఇంకా లేట్ చేస్తే కష్టం అనుకుని రాజమౌళి అండ్ టీమ్ అక్టోబర్ 5 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి షెడ్యూల్ వేసుకున్నారట.

అనుకున్న ప్రకారం అన్నీ సజావుగా జరిగితే మార్చి, ఏప్రిల్ నాటికి ఇద్దరు హీరోలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిపోతుంది. అంటే దాదాపు RRR పై చిత్ర బృందం ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. షూట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్‌కు మరి కొంత సమయం పడుతుంది. ఒకవేళ రెండూ ఒకే సమయంలో చేసినా 2021 సమ్మర్ కి విడుదల  కష్టమేనని సినీ వర్గాల అభిప్రాయం. షూటింగ్ పూర్తయితేనే కానీ ఆర్ఆర్ఆర్ విడుదల విషయంలో క్లారిటీ రాదు.