సింపుల్ గా శివగామి 50వ పుట్టినరోజు వేడుకలు

తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించిన అందాల తార, శివగామి రమ్యకృష్ణ  ఈరోజు తన స్పెషల్ బర్త్‌డే(50వ పుట్టినరోజు)ని జరుపుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ పుట్టినరోజును తన కుటుంబ సభ్యులతో సింపుల్‌గా జరుపుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 50వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకోవడం కంటే ఆనందం ఏముంటింది అని రమ్యకృష్ణ కామెంట్ పెట్టారు. ఇక ఆ ఫొటోలో రమ్యకృష్ణ భర్త, కృష్ణవంశీ, ఆమె కుమారుడు రిత్విక్ వంశీ ఉన్నారు.