సామాన్యుడిపై ఆర్టీసీ చార్జీల బాదుడే బాదుడు: పామూరు జనసేన నాయకులు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ బస్సు చార్జీలు విపరీతంగా పెరిగాయాని, తాము అధికారంలోకి వస్తే అసలు పెంచబోమని కల్ల బొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రాగానే డీజీల్ పై పన్ను అంటూ.. విపరీతంగా చార్జీలు పెంచి సామాన్య ప్రజల మీద అధిక భారం మోపడం ఎంత వరకు సమంజసం అని పామూరు మండల జనసేన నాయకుడు యాట వీరాస్వామి ప్రశ్నించారు. అలాగే కనీసం ఛార్జి ని 5రూ నుండి రూ 10 చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే చెల్లుతుంది అని పామూరు పట్టణ నాయకుడు గుత్తి అఖిల్ అన్నారు. అలాగే గుత్తి మహిత్ మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం చేసే అన్ని పిచ్చి చేస్టలను ప్రజలు గమనిస్తున్నారని.. వారిని త్వరలోనే ఇంటికి సాగనంపడం ఖాయమని అన్నారు.