బీ ఆర్ స్టేడియంపై పాలకుల నిర్లక్ష్యం- క్రీడాకారులకు శాపం

  • సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలం
  • రాజకీయ ముడిసరుకుగా స్టేడియం
  • స్టేడియం దురావస్థ పాపం కాంగ్రెస్, టీడీపీ , వైసీపీలదే
  • తొమ్మిదేళ్ల పాలనలో ముస్తఫా ఒక్క బొచ్చె మట్టి కూడా పోయించలేకపోయాడు
  • జనసేన అధియారంలోకి రాగానే స్టేడియాన్ని పునర్నిమిస్తాం
  • జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ఎంతోమంది జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను అందించిన బీ ఆర్ స్టేడియంపై కొన్ని దశబ్దాలుగా పాలకులు చూపిన నిర్లక్ష్యం భవిష్యత్ క్రీడాకారులకు శాపంగా మారిందని గుంటూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన స్టేడియాన్ని ఆయన ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఐదు దశాబ్దాలుగా ఎంతోమంది మేటి క్రీడాకారులను దేశానికి అందించిన మైదానం ఈ రోజు పాలకుల నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా పడి ఉండటంపై ఆయన ఆవేదనకు గురయ్యారు. పీ టీ ఉష, అశ్విని నాచప్ప వంటి గొప్ప క్రీడాకారిణిలు ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారని గుర్తుచేశారు. శనివారం రాత్రి పడ్డ కొద్దిపాటి వర్షానికే స్టేడియంలో నీళ్లు నిలిచి చిన్న చెరువును తలపించటంపై ఆయన పాలకులపై, సాప్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన కట్టడాలను, విరిగిపోయిన గ్యాలరీలను పరిశీలించారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. తిలాపాపం తలా పిడికెడు అన్న చందాన ఈ స్టేడియం ఇంతటి దురావస్థకు చేరటంలో గత కాంగ్రెస్, టీడీపీ లతో పాటూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాపమూ ఉందని పేర్కొన్నారు. గత పాలకులు అందరూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయకపోగా తమ రాజకీయ పబ్బం గదువుకునేందుకే స్టేడియాన్ని ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు నడిబొడ్డులో ఉన్న స్టేడియాన్ని తన ఆఫీసుకి ఎదురుగా కనిపిస్తూ ఉండే స్టేడియాన్ని తన తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడని స్థానిక వైసీపీ శాసనసభ్యుడు ముస్తఫాని ప్రశ్నించారు. స్టేడియం అభివృద్ధి పై విమర్శలు వచ్చినప్పుడల్లా స్టేడియాన్ని సందర్శించడం మినహా ఇప్పటివరకు ముస్తఫా ఒక్క బొచ్చె మట్టి కూడా పోయించలేకపోయాడని దుయ్యబట్టారు. ఇప్పటికైనా స్టేడియాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని, సాప్ అధికారులను కోరారు. బ్యాడ్మింటన్ , ఫుడ్ బాల్, క్రికెట్ తదితర ఆటలు ఆడే విధంగా స్టేడియాన్ని అభివృద్ధి చేయలన్నారు. తద్వారా పేద, సామాన్య, మధ్యతరగతి పిల్లలు క్రీడలు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల అనంతరం జనసేన పార్టీ అధికారంలోకి రాగానే అధిక ప్రాధాన్యత క్రమంలో స్టేడియాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేరేళ్ళ సురేష్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, కొండూరు కిషోర్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శులు, ఎడ్ల నాగమల్లేశ్వరరావు, కటకం శెట్టి విజయలక్ష్మి, చామర్తి ఆనంద్ సాగర్, సూరిశెట్టి ఉపేంద్ర, బండారు రవీంద్ర, సోమి ఉదయ్, పుల్లంసెట్టి ఉదయ్, సుంకే శ్రీను, రాధా కృష్ణ, శ్రీను నాయక్, సుధ నాగరాజు, పులిగడ్డ గోపి, మెహబూబ్ బాషా, తోట కార్తిక్ , గడ్డం రోశయ్య, గుండాల శ్రీనివాస్, అందే వెంకటేశ్వర్లు, యస్ రజాక్, యడ్ల రాధిక, మహంకాళి శ్రీను, నెళ్లురి రాజేష్, నాగేంద్ర సింగ్, నరేష్, మాదాసు శేఖర్, కొలసాని బాలకృష్ణ, ఏడుకొండలు, పవన్, దుర్గాప్రసాద్, శాంతి కుమార్, వీరమహిళలు ఆసియా, కవిత, అరుణ, అనసూయ, ఆషా, హేమ, మేకల సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.