విజయోత్సవ సభను తలపించిన “సంసిద్ధం” కార్యక్రమం

  • జనం జనం మనం
  • మనం మనం జన ప్రభంజనం.. ఈసారి “గాజు గ్లాసు” పైనే నొక్కుతాం.. రాజానగరం నియోజకవర్గంలో జనసేన టిడిపి సత్తా చూపిస్తాం.. నినాదాలతో హోరెత్తించిన ఇరు పార్టీల శ్రేణులు..
  • జన ప్రవాహంలా పోటెత్తిన జనసేన టిడిపి శ్రేణులు
  • రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో వైసిపి అరాచక శక్తులపై ధర్మయుద్ధం చేసి, భారీ మెజారిటీతో గెలవడానికి జనసేన టిడిపి శ్రేణులు “సంసిద్ధం” అని ప్రకటించిన “బత్తుల”
  • టిడిపి, జనసేన ఐక్యతను నిండుగా చాటుతూ.. కనుల పండుగలా జరిగిన “సంసిద్ధం” కార్యక్రమం
  • కదం తొక్కిన జనసేన టిడిపి యువసైన్యం
  • జనసంద్రంగా మారిన గాడాల గ్రామం
  • బత్తుల దంపతులకు కోరుకొండ నుండి గాడాల వరకు అడుగడుగునా జననీరాజనం
  • బైక్ ర్యాలీకి, సంసిద్ధం కార్యక్రమానికి వచ్చిన ఉత్సాహం, స్పందన చూస్తుంటే రాజానగరం నియోజకవర్గంలో వైసీపీకి 100% నూకలు చెల్లినట్టే
  • గాడాల, కోటి గ్రామం నుండి వైసీపీకి గుడ్ బై చెప్పి “బత్తుల” సమక్షంలో జనసేన పార్టీలో చేరిన 300 మంది
  • గ్యాప్ లేకుండా.. స్వచ్ఛంద వరుస జాయినింగ్స్ తో జనసేన కంచుకోటగా రాజానగరం నియోజవర్గం
  • బైక్ ర్యాలీ, సంసిద్ధం కార్యక్రమం, జనసేన పార్టీలో జాయినింగ్స్.. ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్..
  • బైకులు ఇతర వాహనాలతో కిక్కిరిసిపోయిన కోరుకొండ, గాడాల రహదారి..
  • బత్తుల దంపతులను చూసేందుకు భారీగా రోడ్లకు ఇరువైపులా వచ్చిన జనం..
  • “పవన్ కళ్యాణ్ గారే రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా లేదా నాకు అవకాశం ఇచ్చినా.. 50 వేల మెజారిటీతో గెలిపించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు “బత్తుల”
  • శ్రీ చంద్రబాబు, శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నేతృత్వంలో రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే.. మునుపెన్నడూ చూడని అభివృద్ధి, సంక్షేమం జనసేన టిడిపి కూటమికే సాధ్యం.. “బత్తుల”
  • ఆంధ్రప్రదేశ్, రాజనగరం నియోజకవర్గంలో సుభిక్షంగా ఉండి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ఈ అరాచక వైసిపి ప్రభుత్వం పోవాలి.. జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రావాలి..
  • గాడాల గ్రామం పూర్తిగా జనసేనకు ఏకపక్షం కావడంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం…
  • ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నారు..!
  • గాడాల, కోటి గ్రామం నుండి.. పలువురు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వారి అనుచరులు 300 మంది జనసేన పార్టీలో చేరిక..
  • రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి తారాస్థాయికి చేరింది..

రాజానగరం నియోజవర్గం, కోరుకొండ మండలం, గాడాల గ్రామంలో జరిగిన సంసిద్ధం బహిరంగ సభ.. రాజానగరం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి బత్తుల బలరామకృష్ణ సారధ్యంలో జరిగిన ఈ బహిరంగ సభ జనసేన టిడిపి పార్టీల సైన్యంతో అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముందుగా కోరుకొండ గ్రామం నుండి నియోజకవర్గంలోని నాయకులు, జనసైనికులు వీరమహిళలు వేలాది, కార్లతో, ఆటోలతో ర్యాలీగా.. ప్రజా నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి లకు ఘన స్వాగతం పలికి పెద్దఎత్తున భారీ బైక్ ర్యాలీగా బహిరంగ సభ జరిగే గాడాల గ్రామం చేరుకున్నారు. గ్రామంలో చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా పేల్చుతూ.. తీన్మార్ డప్పులతో, పూలవర్షం కురిపిస్తూ.. యువత కేరింతలతో.. మహిళల హారతులతో.. అడుగడుగునా బత్తుల దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కిక్కిరిసిన రోడ్ల వెంబడి పాదయాత్ర చేస్తూ అందరికీ అభివాదం చేస్తూ.. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ఈసారి ప్రతి ఒక్కరూ రాజానగరం నియోజకవర్గంలో.. జనసేన టిడిపి కూటమిలో భాగంగా జనసేన పార్టీ పక్షాన నిలబడాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగింది. అనంతరం రానున్న ఎన్నికల్లో మేము సైతం అంటూ గర్జించిన జనసేన టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన సంసిద్ధం భారీ బహిరంగ సభలో.. నియోజకవర్గంలోని అనేక మంది సీనియర్ నాయకులు జనసేన పార్టీలో చేరిన ‘బత్తుల’ దంపతులు ఈరెండు సంవత్సరాల కాలంలో చేసిన సేవలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు చేసిన ఆర్థిక సహాయాలు మరియు పాదయాత్ర ద్వారా వారు జనసేన పార్టీని రాష్ట్రం నలుమూలలా తెలిసేలా చేసిన తీరును కొనియాడుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా గాడాల కోటి గ్రామం నుండి 300 మంది వైసీపీ సీనియర్ నాయకులు, పలువురు వారి అనుచరులు బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం నియోజవర్గ సీనియర్ నాయకులు దుష్ట పరిపాలన చేస్తున్న వైసీపీ సర్కార్ని తుదమొట్టించాలని మీరు కచ్చితంగా ధర్మ యుద్ధం చేస్తున్న బత్తుల బలరామకృష్ణ గారి దంపతులకు జనసేన నాయకులు, టిడిపి నాయకులు దుస్సాలువాలు వేసి గజమానులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలు పేదలను ఆదుకున్న తీరు ను ప్రశంసిస్తూ… రానున్న ఎన్నికల్లో రాజానగరం నుండి శాసన సభ్యుడిగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది నియోజవర్గానికి ఉన్నతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ఇతరత్రా భారీ ఏర్పాట్లు బాణసంచా సభకు విచ్చేసిన వారందరికీ ఆకర్షించాయి. అనంతరం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ.. ఈ రెండు సంవత్సర కాలంలో మాకు సహకరించిన నియోజకవర్గంలోని జనసేన నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు ఈరోజు ఇంత భారీ కార్యక్రమం ఏర్పాటు చేసన గాడాల సీనియర్ నాయకులు అడ్డాల శివ, చక్రవర్తి, అడ్డాల శ్రీనివాస్, మన్యం శ్రీనివాస్, గాదంశెట్టి వెంకన్న బాబు ఇతర సీనియర్ నాయకులకు జనశ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఎవరెన్ని కష్టాలు పెట్టినా, ఎవరెన్ని నిందలు వేసినా.. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం మరింతగా పోరాడుతానే తప్ప, ఎక్కడికి పారిపోమని రామన్న రోజుల్లో మీ అందరి సహాయ సహకారాలతో మరింతగా పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతానని, మీ అందరి సహకారం ఇలానే ఉండాలని. జనసేన టిడిపి శ్రేణులు సమన్వయంతో ఐకమత్యంగా పనిచేద్దామని, టిడిపి సీనియర్ నేతల సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుని వారిని కలుపుకుని వారిని గౌరవిస్తూ ముందుకు వెళదామని, ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు మాట్లాడుతూ.. ఈరోజు ఇంతటి చక్కటి బైక్ ర్యాలీ, “సంసిద్ధం” బహిరంగ సభకు ప్రజా స్పందన, వారి నమ్మకం చూస్తుంటే జనసేన పార్టీ, టిడిపి పార్టీ కూటమిలో మా బాధ్యత మరింత పెరిగిందని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి, టిడిపి జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని, రేపు రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పోరాడి, భారీ మెజారిటీతో రాజానగరం సీటును జనసేన టిడిపి కూటమి ఖాతాలో వేస్తామని తెలుపుతూ.. రాజానగరం నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నేతల సలహాలు, సూచనలు వారి ఆశీస్సులతో ఇరు పార్టీలు పొత్తుధర్మాన్ని పాటిస్తూ.. సమన్యాయంతో ముందుకు వెళతామని, ఈ “సంసిద్ధం” బహిరంగ సభ ఇంత ఘనంగా నిర్వహించిన గాడల గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అధికార వైసిపి వారు ఓటమి భయంతోనే జనసేన, టీడీపీ కూటమిపై తనపై విషం కక్కుతున్నారని, జనసేన, టిడిపి శ్రేణులు మధ్య గొడవలు పెట్టి తద్వారా వాళ్లు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మరింతగా పోరాడుతానే తప్ప ఎక్కడికి పారిపోమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం పని చేస్తానని, ప్రజల పక్షాన బలంగా నిలబడతానని, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు గర్వపడేలా భారీ మెజారిటీ సాధిస్తామని తెలుపుతూ.. సంసిద్ధం కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా విజయవంతం చేసినందుకు నియోజకవర్గం జనసేన టిడిపి సీనియర్ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఈ వైసీపీ సర్కార్ను ప్రజలందరూ ఐక్యమై త్వరగా ఇంటికి పంపాలని, సమాజానికి ఎంతో చేయాలని పరితపిస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ గారు, విజన్ ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గార్ల నాయకత్వంలో జనసేన టిడిపి కూటమికి ఒక అవకాశం ఇచ్చి, ప్రజలందరూ ఆశీర్వదించాలని, రాజానగరం నియోజకవర్గం నుండీ రానున్న ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించాలని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గార్ల నాయకత్వాన్ని బలపరచాలని అభ్యర్థిస్తూ.. “సంసిద్ధం” బహిరంగ సభ ఘనవిజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి ఐక్యతను చాటుతూ ఇరు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.