కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ప్రతిరోజూ శానిటైజ్‌

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా వచ్చే నెల నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ప్రతిరోజూ శాసనసభ, మండలిని శానిటైజ్‌ చేయాలని తీర్మానించారు. కరోనా లక్షణాలున్న సభ్యులను, ఇతరులను గుర్తించే విధంగా శాసనసభ, మండలి, బయట, లోపల అధునాతన స్కానర్లను ఏర్పాటు చేయనున్నారు. సభ్యులు మాస్కులు పెట్టుకోకపోతే స్కానర్ సైరన్‌ మోగిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేస్తుంది. శానిటైజ్‌ చేస్తుంది. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద దీనిని అమర్చనున్నట్లు సభాపతి పోచారం తెలిపారు.