జనసేన నేత సంగీత సాయి హఠాన్మరణం, నాగబాబు సంతాపం

“సాయి… నువ్వు భౌతికంగా దూరం అయినా, నువ్వు అన్నా అని పిలిచే పిలుపు నా చుట్టూ ఎప్పుడూ ఉంటుంది” అంటూ భావోద్వేగానికి లోనై నటుడు నాగబాబు ట్వీట్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నేత సంగీత సాయి గుణ రంజన్ హఠాన్మరణంతో నటుడు నాగబాబు దిగ్భ్రాంతికి గురై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “నా మనసుకు ఎంతో చేరువైన, నా కుటుంబంలో ఒకడిగా మెలిగిన వ్యక్తి సంగీత సాయి” అని నాగబాబు వివరించారు.