జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మూడవరోజు 19వ డివిజన్ అధ్యక్షులు వటల హరి ప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊరు మన ఆట ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు!. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వీరమహిళలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది.! ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ ఉపాధ్యక్షులు తోట యుగంధర్, శ్రీమతి వటల నాగమణి, బాసింశెట్టి గోపి, చాట్ల అప్పలరావు, వేణు, సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.