జామ మొక్కల పంపిణీ చేసిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గురువారం సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం, పంటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఓట్ల బలిజపాలెం నందు జామ మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ జనసేన లక్ష్యమని అన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే దురవాసన, పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు పెట్టేటప్పుడు కంపెనీ యాజమాన్యం దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారికి ప్యాకేజీ అమౌంట్ ఇప్పిస్తానని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా వీళ్ళకి ప్యాకేజీ అమౌంటు అందకపోవడం చాలా దురదృష్టకరం. అయితే కంపెనీల దగ్గర ప్యాకేజీ అమౌంట్ ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తీసుకుని వీళ్ళకి ఇవ్వడం లేదు. ఈ విషయంపై త్వరలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనగళం వినిపిస్తాం. అదేవిధంగా స్థానిక నాయకులు ఎవరైనా సరే వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు దోచుకుని ఉంటే గౌరవంగా వాళ్ళకి అందజేయండి. లేదంటే ఆయా కంపెనీ దగ్గర నిరసన తెలియజేస్తూ వాళ్లకి ప్యాకేజీ నోటు ఇచ్చేంతవరకు పోరాడుతామని తెలియజేసారు.