సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన నాయకులతో కలిసి వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి రిజర్వాయర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి రిజర్వాయర్ నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉండే రేజర్వాయర్. వేల ఎకరాలకి సాగునీరు, తాగునీరు అందించే రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ మీద చేపలు పట్టుకుని జీవనాధారం కొనసాగించే కొన్ని వందల కుటుంబాలు. ఖరీఫ్ సీజన్ మరి రిజర్వాయర్ మరమ్మతులు నతనడకన నడుస్తూ రిజర్వాయర్లో చుక్క నీరు కూడా లేకపోవడం శోచనీయం. మరి రిజర్వాయర్ కి నీళ్ళు అందిస్తారా లేదంటే ఈ రిజర్వాయర్ కింద భూములు ఉన్న రైతులకి నష్టపరిహారం అందిస్తారా. ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం తెలియ చేయాలి. ఎందుకంటే ఈ రిజర్వాయర్ నిండా నీళ్లు ఉంటే రెండు పంటలు పుష్కలంగా పండించుకునేటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ రిజర్వాయర్ కింద చిన్న సన్నకారు కౌలు రైతులు ఉంటారు. మరి ప్రభుత్వం రిజర్వాయర్ కి నీళ్ళు ఇచ్చి పంట పండించుకునే దానికి అవకాశం కల్పిస్తుంది. లేకపోతే నష్టపరిహారం చెల్లిస్తుందా అనే విషయాన్ని స్పష్టత ఇవ్వాలి. అదే విధంగా రిజర్వాయర్లు అక్రమ గ్రావెల్ తవ్వకాలని అరికట్టాలి. దానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెహమాన్, శ్రీను, సందీప్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.