సర్వేపల్లి జనసేన మండల కమిటీ సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం నందు మండల కమిటీ సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది. నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి అధ్యక్షతన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కమిటీ మెంబర్లతో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని సర్వేపల్లి నియోజకవర్గంలో బలోపేతం చేసే విధంగా పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి ప్రజా సమస్యలపై ఏ విధంగా పోరాడాలి అనే విషయాన్ని నిర్దేశంతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల్లో ఉన్నటువంటి మండల అధ్యక్షులు కమిటీ మెంబర్లు జనసైనికులు జనసేన నాయకులు పాల్గొన్నారు.