సత్తుపల్లి జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా మిరియాల శివాజి

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ రామ్ తాళ్లూరి సహకారంతో నియోజకవర్గ ఇన్చార్జి బండి నరేష్ సత్తుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా మిరియాల శివాజిని నియమించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుండి శివాజీ పార్టీకి చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని క్రియాశీలక సభ్యత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా చేయించిన విధానాన్ని బట్టి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన విధానాన్ని బట్టి గతంలో అనేక పార్టీ కార్యక్రమాల్లో పార్టీ పదవుల్లో పనిచేసిన అనుభవాన్ని బట్టి నియోజకవర్గ స్థాయిలో పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా శివాజి మాట్లాడుతూ పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియచేసారు రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా గ్రామ కృషిచేస్తాను అని ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియచేసిన జనసేన నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు పవన్ కళ్యణ్ అభిమానులకు ధన్యవాదాలు తెలియచేశారు.