విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో సత్యవేడు జనసేన

సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు, కెవిబిపురం మండలం అంజూరు గ్రామపంచాయతీ మరియు నాగలాపురం మండలాల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ డా.పసుపులేటి హరిప్రసాద్ జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ ఆదేశాల మేరకు రూపేష్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మన ఎంపిలు పార్లమెంట్ పోరాడాలని ప్లకార్డులతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను, రాజేంద్ర జ్యోతీశ్వర్, సుబ్బు రూపకుమార్, మోహన్ మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్క ఆంధ్ర ఎంపీలు అందరూ పార్లమెంటులో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మీరు వాయిస్ బలంగా వినిపించాలని కోరుకుంటూ @GuruM ysrcp@vsREDDY ఎంపీ.