సేవ్ ఆరుకు: అనంతగిరి జనసేన డిమాండ్

జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ పచ్చని ప్రాంతమైన నిమ్మలపాడులో మైనింగ్ మాఫియా పచ్చదనాన్ని పర్యావరణాన్ని నాశనం చేయుచున్నారు. కనీసము పర్యావరణ అనుమతులు లేవు మరియు పీసా గ్రామ సభ జరగనూ లేదు. ఈ ప్రభుత్వం గిరిజనుల మీద లేని ప్రేమ మైనింగ్ విషయాల్లో అక్రమంగా తీసుకు పోవుచున్నది. గిరిజనులకు నడిచే దారిని ఇవ్వని అనుమతులు మైనింగ్ కి ఏ విధముగా అనుమతి ఇచ్చియున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అమాయక గిరిజనులను మాయమాటలతో మభ్యపెట్టి కాల్ సైట్ మైనింగ్ అక్రమంగా తీసుకొని పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ మైనింగ్ మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల మీద ఎందుకు లేదు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ డిమాండ్ తరపున చేయడం జరిగింది. గిరిజన చట్టాలను తుంగలో తొక్కి మైనింగ్ మాఫియాను ప్రత్యేకంగా పరోక్షంగా సహకరిస్తున్న వైసిపి నాయకులు గిరిజన ప్రజలకు సమాధానం చెప్పాలి. 1996 చట్టపరంగా ఈ మైనింగ్ అక్రమంగా జరుగుచున్నది. ఏ రోజూ గ్రామసభ జరుగలేదు. అలాగే అమాయక గిరిజనులను మభ్యపెట్టి దోచుకోవడంలో వైసిపి ప్రభుత్వము ముందుందని అధ్యక్షులు చిట్టం మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు దండుసేన నవీన్ కుమార్, కొర్రా ప్రవీణ్ కుమార్, శ్రీరామ్, రాందాస్, లక్ష్మణ ప్రసాద్, రామకృష్ణ, అనంతగిరి మండల నాయకులు జి మంగళ, కొర్రా రమేష్, వీరమహిళ రత్నప్రియా పాల్గొన్నారు.