అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన రాయచోటి ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు

  • ఎమ్మెల్యే హామిని నిలబెట్టుకోలేదని ఆరోపించిన ప్రజా సంఘాలు

రాయచోటి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆదేశాలతో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి అంబేద్కర్ చిత్రపటాన్ని చించివేసి అవమానించిన దానిపై అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫ్లెక్సీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా గత డిసెంబర్ 6న ప్రజా సంఘాలు ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆదేశాలతో అన్నమయ్య కలెక్టర్ శిరీష నేతృత్వంలో రాయచోటి తాసిల్దార్ అంబేద్కర్ విగ్రహ సిమెంటు దిమ్మెను కూడా ధ్వంసం చేసి చిత్రపటాన్ని చించివేసి డిసెంబర్ 7 అర్ధరాత్రి సమయంలో దొంగతనంగా రాత్రికి రాత్రి విగ్రహాన్ని తొలగించి తాసిల్దార్ కార్యాలయంలో దాచి పెట్టారని, డిసెంబర్ 12 వరకు విగ్రహం ఆచూకీ తెలపకుండా చేశారని ఎస్సీ ఎస్టీ కమిషన్ కు చేసిన ఫిర్యాదులు ఫిర్యాదుల పేర్కొన్నట్టు తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలోనే మళ్లీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత డిసెంబర్ 7 నుండి 12వ తేదీ వరకు నిరాహార దీక్షలు చేసిన మీదట రాయచోటి ఎమ్మెల్యే స్వయంగా నిరాహార దీక్ష శిబిరం వద్దకు వచ్చి విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చాడని ఇప్పటివరకు ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వారు ఫిర్యాదుల పేర్కొన్నట్టు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వాలు అడ్డుకోకూడదని రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు గతంలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ సూచనలు చేసిందని దీనిని పట్టించుకోకుండా రాయచోటి ఎమ్మెల్యే కుల వ్యవక్షతోనే అంబేద్కర్ విగ్రహాన్ని రాయచోటి తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో పెట్టడం ఇష్టం లేక తొలగించారని ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రామాంజనేయులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు జనసేన జిల్లా కోర్దినేటర్ రామా శ్రీనివాస్, ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఏపీ వడ్డెర విద్యావంతులు వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి శంకర్ ఉపాధ్యక్షులు చల్లా రెడ్డయ్య రామకృష్ణ రైతు సంఘం నాయకులు రంగారెడ్డి టిడిపి నాయకులు మహబూబ్ బాషా బసిరెడ్డి పాల్గొన్నారు.

గ్రామస్థాయి నుండి ఉద్యమం:
గత డిసెంబర్ 7 అర్ధరాత్రి తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని అదే స్థానంలో ఏర్పాటు చేయని పక్షంలో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంబేద్కర్ పై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుండి ఉద్యమాన్ని తీసుకొస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు.