ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌ షెడ్యూల్ విడుదల

క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా విడుదల చేసింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 27న తొలి వన్డేతో ఈ సిరీస్ ఆరంభం కానుంది.

ఆసీస్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు మ్యాచ్‌లు ఆడనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8:30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. సిడ్నీలో తొలి వన్డే నవంబరు 27న జరగనుంది. తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4న, తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న మొదలవనున్నాయి. టెస్ట్ సిరీస్ ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఉన్నాయి. ఆసీస్ వెళ్లిన తరువాత భారత జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు.

వన్డే షెడ్యూల్:

1. తొలి వన్డే నవంబరు 27 – సిడ్నీ (8:30 AM)

2. రెండో వన్డే నవంబరు 29- సిడ్నీ (7:30 AM)

3. మూడో వన్డే డిసెంబరు 1- మనుకా ఓవల్ (8:30 AM)

టీ20 షెడ్యూల్:

1. తొలి టీ20 మ్యాచ్ డిసెంబరు 4 – మనుకా ఓవల్ (12:30 PM)

2. రెండో టీ20 మ్యాచ్ డిసెంబరు 6- సిడ్నీ (1:30 PM)

3.మూడో టీ20 మ్యాచ్ డిసెంబరు 8- సిడ్నీ (1:30 PM)

ప్రాక్టీస్ మ్యాచ్ షెడ్యూల్:

1. తొలి ప్రాక్టీస్ మ్యాచ్ డిసెంబరు 6- డ్రమ్మోయిన్ ఓవల్, సిడ్నీ

2. రెండో ప్రాక్టీస్ మ్యాచ్ డిసెంబరు 11- సిడ్నీ- డే/నైట్

టెస్టు షెడ్యూల్:

1. తొలి టెస్టు మ్యాచ్ డిసెంబరు 17న- అడిలైడ్ ఓవెల్ (2:00 PM)- డే/నైట్ టెస్టు

2. రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 26న- మెల్‌బోర్న్ (4:30 AM )

3. మూడో టెస్టు మ్యాచ్ జనవరి 7న- సిడ్నీ (4:30 AM)

4. నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 15న- గబ్బా (5:30 AM)