తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్..?

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. దీనిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రానున్న మూడు రోజుల్లో విద్యాసంస్థలను నడపాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం అసెంబ్లీలో పేర్కొన్నారు. గత రెండు మూడ్రోజులుగా తెలంగాణలోని పలు స్కూళ్లలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు, కామారెడ్డి జిల్లాలోని టేక్రియాల్ కస్తూర్భా పాఠశాలలో 32 మందికి, నాగోల్ బండ్లగూడలోని తెలంగాణ మైనారిటీ గర్ల్స్ హైస్కూలులో 36 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థిితి అదుపుతప్పక ముందే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.