యూపీ, పంజాబ్‌లో స్కూళ్లు రీఓపెన్

దాదాపు ఏడు నెలల తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్తరప్రదేశ్‌, పంజాబ్ రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. యూపీలోని లక్నోతో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో స్కూళ్లను ఓపెన్ చేశారు. కొన్ని చోట్ల స్కూళ్లకు హాజరైన విద్యార్థులకు ఫిజికల్‌గా, ఇంటి వద్దే ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్పుతున్నారు. విద్యార్థులు స్కూళ్లకు హాజరుకావడం పట్ల టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్‌లో కూడా ఈ రోజే స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కూడా బుడలను మూసివేశారు. 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు కేవలం డౌట్ క్లారిఫికేషన్ క్లాసులను తీసుకుంటున్నారు. స్కూళ్లలో ఆన్‌లైన్ క్లాసు కూడా కంటిన్యూ కానున్నాయి. స్కూళ్లకు వస్తున్న విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించారు. 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు 11, 12వ తరగతులకు క్లాసులు తీసుకోనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లను నిర్వహిస్తున్నారు.