ఆడపిల్లల భద్రతకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు

విజయనగరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వీరమహిళల సమావేశం ఉత్తరాంద్ర రీజనల్ కో ఆర్డినెటర్ తుమ్మి లక్ష్మీ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తూ ప్రజాదరణ పొందాలని అలాగే మహిళ స్వయం ఉపాధి చేసుకోవడానికి పార్టీ తరుపున సపోర్ట్ చేస్తామని అతిధులుగా వచ్చిన రీజనల్ కో ఆర్డినేటర్స్ అన్నారు. తుమ్మి లక్ష్మీ రాజ్ మాట్లాడుతూ… మహిళలు, బాలికలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తమను తాము కాపాడుకొనే విధంగా వాళ్ళని వాళ్లే సిద్ధపరుచుకోవాలని.. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి స్కూల్లో కాలేజీలో ఆడపిల్లల భద్రతకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ప్రత్యేకంగా పెట్టిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొని మహిళల్లో బాధ్యత ఉండాలని.. అందరు ఒకేతాటిపై పార్టీ అభివృద్ధికి దోహదపడాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వీర మహిళా విభాగం కోఆర్డినేటర్ కిరణ్, శ్రావణి, త్రివేణి రాష్ట్ర చేనేత విభాగం వైస్ చైర్మన్ ప్రియాంక మరియు జిల్లా వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.