నిస్వార్థ ప్రజా సేవకులు వైసీపీలో ఉండలేరు

  • కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: నిస్వార్ధంగా ప్రజాసేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన ఎవరైనా జగన్ కుట్రల పార్టీలో ఉండలేరని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని బొలిశెట్టి నివాసం వద్ద తాడేపల్లిగూడెం వైయస్సార్ పార్టీ 6 వార్డ్ ఇంచార్జ్ ముద్దుల నాగ వెంకటప్రసాద్ ను బొలిశెట్టి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతో పనిచేసిన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోలేదని తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదని పవన్ కళ్యాణ్ నిస్వార్ధ ప్రజాసేవకు, ఆయన విధానాలకు ఆకర్షితులై జనసేనలోకి రావడం అభినందించాల్సిన విషయం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్, అతని వెంట నడిచే నాయకులు అంతా కుటిల రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు కుదేలైపోయాయని ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని పేర్కొన్నారు. కానీ తాను ఇచ్చేవి మాత్రం చెప్పుకుంటూ దోచేవి లాక్కునేవి చెప్పడం లేదన్నారు. ప్రజలు వాటిని గుర్తించి వైసీపీని భూస్థాపితం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 6 వార్డ్ ఇంచార్జ్ మద్దుల నాగ వెంకట ప్రసాద్ తోపాటు గొర్ల దుర్గారావు, వేగిరాజు రామచంద్ర రాజు, ఆది కొండలరావు, నారిన ఏడుకొండలు, సోమశేఖర వర్మ, తదితరులు పార్టీలో చేరారు.