బర్మా వీధి సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన షాజహాన్ బాషా

మదనపల్లె పట్టణం నందు మొదటిసారిగా మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా మదనపల్లి టౌన్ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు ఆధ్వర్యంలో బర్మా వీధి సాయిబాబా గుడి నందు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శి రాటకొండ మధుబాబు, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గొడవల శివప్రసాద్, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, గంగారపు నవీన్ కుమార్ చౌదరి, రాజంపేట కార్యాలయ కార్యదర్శి పూల మురళి, మోడెం సిద్ధప్ప, మాజీ కౌన్సిలర్లు బాబు నాయుడు, రాటకొండ సోమశేఖర్, రామిశెట్టి నీలకంఠ, ఆంజనేయులు, కప్పల శ్రీరాములు, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ దాదా పీర్ సాజిద్ పులిమహాలక్ష్మి, రాధా, నాగమణి జనసేన-తెలుగుదేశం-బిజెపి నాయకులు, కార్యకర్తలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొన్నారు.