విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కు సిగ్గుపడాలి

  • చిక్కటి చిరునవ్వుల సిఎం వై.. చీప్.. మాటలు.. మీ ఇళ్ళలో పెళ్లిళ్ళ గురించి సంబంధాల గురించి మాకు తెలుసు కానీ ఆ సంస్కారం అధ్యక్షులు నేర్పలేదు
  • ప్రజా ప్రభుత్వం స్థాపించేందుకు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా వారి బాటలో ప్రయాణించేందుకు సిద్ధంగానే ఉన్నాం

నెల్లూరు: డౌన్ డౌన్ మంగమ్మగారి ముని మనవడు అంటూ జనసేన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ వద్ద నుంచి పుచ్చల పల్లి సుందరయ్య గారి బొమ్మ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తూ బహిరంగ సభలో అడంగెలి మాటలు ఎందుకు..? జగన్ గారు మీరు మాట్లాడే మాటలు మహిళలనుకించపరిచే విధంగా ఉన్నాయి. సామాజిక న్యాయం పేరుతో రబ్బర్ స్టాంపులు తయారు చేసుకున్నావు. మీరు ఇచ్చిన 26 మంత్రుల పేర్లు అయినా కనీసం ఎవరికైనా తెలుసా. వారితో మీరు ఎప్పుడైనా పది నిమిషాలు మాట్లాడారా..? మీరు దోచుకోండి, నాకు దోచివ్వండి అన్న చందాన సాగుతుంది మీ ప్రభుత్వం. బటన్ నొక్కుతూ కోట్ల రూపాయలు మూటగట్టుకొని ఎనకేసుకుంటున్న మీకు మాట్లాడే అర్హత లేదు.
ఏకపక్షంగా తెలిసి తెలియని జ్ఞానంతో నియంత పాలనను పరిపాలిస్తున్నారు. బాధ్యతగల సీఎంగా ఉండి నోటికి వచ్చి మాట్లాడడం మీ తప్పుడు ప్రవర్తనను నిరూపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మీరుక్షమాపణలు చెప్పాలి. సొంత చెల్లిని కన్నతల్లిని దూరంగా తరిమేసిన మీరే విశ్వసనీయత గురించి మాట్లాడడం సిగ్గు. సొంత బాబాయి గొడ్డలి పోటు కేసు ఇంకా కొలిక్కి రాక నాలుగు సంవత్సరాలు గడుస్తుంది మీ మీద ప్రజలకు నమ్మకం కోల్పోయింది. కోడి కత్తీ కేసులో సాక్ష్యం చెప్పమంటే ట్రాఫిక్ జామ్ అంటూ బుకాయించే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. 43 వేల కోట్ల రూపాయల అవినీతిలో అడ్డంగా చిక్కుకున్న మీరే అవినీతి గురించి మాట్లాడాలి.
బెంగళూరు ప్యాలెస్ హైదరాబాదులో విలాసాల అనుభవించిన మీరు సీఎం అవ్వకముందు ఎక్కడ ఉండేవారు సరి చూసుకోవాలి.
సింగిల్ గా వచ్చే సింగం ప్రజల్లో పరదాలు లేకుండా వచ్చి నాలుగు సంవత్సరాలపై బడింది అని ప్రజలు చెప్పుకుంటున్నారు.
ప్రతిపక్షాలు ఎట్లుండాలో వివరించే మీరు ఇప్పటికిప్పుడు 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే దమ్ముందా..?
రాజకీయం అనేది సమయం బట్టి మారుతూ ఉంటుంది అన్న విచక్షణ లేకుండా వ్యాఖ్యలు చేస్తున్న మీకు సిగ్గుపడాలి.. మీ వింత పోకడలతో రాష్ట్రం మొత్తం భయాందోళనకు గురి అయి ఉన్నారు.
స్కీములు ప్రభుత్వం ఎప్పుడు తలకిదులవుతుందో అని భయం లో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు పావులు కదులుతున్నారు. జనసేనకు పదవుల ఆశించని సొంత లాభం ఆలోచించని బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఏదో ఆశించి వచ్చేవాళ్లు వస్తుంటారు పోతుంటారు, అటువంటి వారు వేళ్ళ మీదే ఉంటారు.
మా నాయకులు కార్యకర్తలు గురించి ప్రత్యేకంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో సహనం కచ్చితంగా ఉండాలి మార్పు కోసం ప్రయత్నించే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి తోడుగా మేమంతా ఉన్నాం. పాతికేళ్ల ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో నడవాలని రాబోయే భావితరాలకు బంగారు భవిత కానుక గా ఇవ్వాలని ప్రయత్నంతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ గారికి మేమంతా తోడుగానే ఉన్నాం.. ఆయన నిర్ణయం ఏదైనా కూడా మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, వీర మహిళా విభాగం కన్వీనర్ కోలా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, బన్నీ, వర, తరుణ్, వర్షన్, బాలు, శీను, భాను, మౌనిష్, కేశవ, వీరమహిళలు రేణుక హైమావతి, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.