ముఖ్యమంత్రి జగన్ ను హెచ్చరించిన శంకర్ గౌడ్

తెలంగాణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చేసిన వ్యాఖ్యలను యావత్ తెలంగాణ తరపున జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ జూబిలీహిల్స్ జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికాముఖంగా తీవ్రంగా మాట్లాడుతూ తీవ్రంగా ఖండిస్తున్నామని, పాలసీల పరంగా ప్రశ్నిస్తుంటే మీరు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని, అయినా ఇంకా ఎంత కాలం పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతారని, కేవలం మా అధినేత నేర్పిన సంస్కారంతోనే ఆగుతున్నామని, మేము మీ తాత ముత్తాతల గురించి కూడా మాట్లాడగలమని అంతవరకు తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నామని అన్నారు.