తమిళనాడు ప్రభుత్వ నిధికి శంకర్ సాయం

ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తుంది. లక్షల కొలది కేసులు, వేల కొలది మరణాలు సంభవిస్తుండడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. కొందరి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. కరోనా వలన లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. వీరిని ఆదుకునేందుకు సినీ సెలబ్రిటీలు నడుం కడుతున్నారు. అయితే తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు.

ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య రజనీకాంత్ భర్త విశాగణ్ కోటి రూపాయలు, దర్శకుడు వెట్రిమారన్, రూ.10 లక్షలు, ఎడిటర్ మోహన్, ఆయన తనయుడు మోహన్ రాజా, జయం రవి రూ. 10 లక్షల రూపాయలు, తమిళ నటుడు శివ కార్తికేయన్ విరాళం కింద పాతిక లక్షలు అందించారు. ఇక తాజాగా దర్శకుడు శంకర్ రూ. 10 లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారట. కాగా, ప్రస్తుతం శంకర్ విశ్వ నటుడు కమల్ హాసన్ తో “ఇండియన్ 2” చిత్రం చెయ్యాల్సి ఉంది. దాని తర్వాత మరో బిగ్గెస్ట్ అండ్ బెంచ్ మార్క్ కాంబో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చెయ్యనున్నారు.