మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

మెగాస్టార్ చిరంజీవి తాను కరోనా బారిన పడ్డానని వెల్లడించారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ”ఆచార్య’ షూటింగ్ ప్రారంభించాలని కొవిడ్‌-19 పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను’ అని చిరు పేర్కొన్నారు.