సాయిధరం తేజ్ కు పవన్ కళ్యాణ్ బయోగ్రఫి పుస్తకాన్ని చూపించిన షేక్ బాషా

హైదరాబాద్, గత ఏడాది సాయి ధరం తేజ్ వినాయక చవితి రోజున బైక్ మీద ప్రయాణిస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగిన సంగతి అందరికీ విదితమే.. ఆ సమయంలో కొత్తగూడెం జిల్లా అభిమానులు, మెగాస్టార్ అభిమానులు సాయి ధరం తేజ్ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించడం.. కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలను చూసి..సాయి ధరం తేజ్ రాష్ట్రవ్యాప్తంగా అలాంటి కార్యక్రమాలను నిర్వహించిన వారిని పిలిపించుకొని.. హైదరాబాద్ ఫిలిం చాంబర్ పక్కన ఉన్న హోటల్లో అందరికీ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరితో మాట్లాడటం జరిగింది. వచ్చిన వారితో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడండి, అలాగే కేకులు వృధా ఖర్చు చేయకుండా అనాధ ఆశ్రమం, వృద్ధుల ఆశ్రమాలలో ఎక్కువ గడపండి అని అన్నారు. అనంతరం సమావేశంలో కొత్తగూడెం జనసైనికుడు మరియు పవన్ కళ్యాణ్ అభిమాని షేక్ బాషా రాసిన పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ పుస్తకాన్ని చూపించడం జరిగింది. సాయి ధరం తేజ్ పుస్తకాన్ని పరిశీలిస్తూ.. దాని గురించి బాషాతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ కలిసి త్వరలో సాయి ధరం తేజ్ తో మాట్లాడతాను అని చెప్పడం జరిగింది.