పొన్నలూరు మండలాధ్యక్షుడిని అభినందించిన షేక్ రియాజ్

  • పొన్నలూరు మండలంలో కనపర్తి మనోజ్ కుమార్ కి ప్రజా ఆదరణ పెరిగింది
  • ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటాన్ని కొనసాగిస్తున్న జనసేన మనోజ్ కుమార్
  • మనోజ్ కుమార్ ఏదైనా ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తాడు.

ప్రకాశం జిల్లా, కొండెపి, పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ, ప్రజల యొక్క ప్రేమాభినందనలను పొందుతూ, రోజురోజుకీ పొన్నలూరు మండలంలో ప్రజాదరణ పొందుతూ, సమస్యలను పరిష్కార దిశగా ముందుకు అడుగులు వేస్తున్న వ్యక్తి కనపర్తి మనోజ్ కుమార్ అని షేక్ రియాజ్ తెలియజేశారు. జనసేన పార్టీ ఏదైనా ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, ప్రజలకు అండగా నిలబడుతుంది, దేశ నాయకుల స్ఫూర్తితో జనసేన పార్టీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా పొన్నలూరు మండలంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే కచ్చితంగా అండగా ఉంటామని మనోజ్ కుమార్ తెలియజేశారు.