తగు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది

  • నెల్లూరు సిటీ జాఫర్ కాలువ పై ఇళ్ళకు ప్రత్యమ్నాయం చూపకుండా ఉన్న ఫలానా తెల్లవారు జామున ఖాళీ చేయించడం అమానుషం
  • జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మైపాడు గేటు కాలువ వద్ద ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా నిరుపేదల ఇళ్ళను అర్థరాత్రి వైసీపీ ప్రభుత్వం కూల్చడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ జనసేన నాయకులు పేదలను పరామర్శించారు. ఈ సందర్బంగా జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ మాట్లాడుతూ…. నెల్లూరు సిటీ మైపాడు గేట్ కాలువ కట్ట దగ్గర దాదాపు 30, 40 సంవత్సరాల పైన ఇక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలు రెక్క ఆడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో వాగ్దానాలు గత ఎలక్షన్ లో వైఎస్ఆర్సిపి పార్టీ గాని గెలిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వచ్చి ఎన్నో హామీలు ఇచ్చి అడుక్కొని ఓట్లేపించుకొని గెలిచి వీళ్ళని ఈరోజు అన్యాయంగా రోడ్లు పాలు చేస్తున్నారు. పొద్దున్నే నాలుగు నాలుగున్నర గంటలకు పోలీసు బలగాలతో, జెసిబిలతో వచ్చి ఇంట్లో పసిబిడ్డలు ముసలి వాళ్లు అని కూడా చూడకుండా వాళ్ళని రోడ్లు పైకి లాగేసి వాళ్ళ ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి పక్కనే ఉన్న కాలవలో వాళ్ల సామాననులు, ఆటోలు, పశువులు కూడ కనికరం లేకుండా నెట్టి పడేశారు. ఈ వైఎస్ఆర్సిపి పార్టీని అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒకటి అడుగుతాం మీరు ఇంకెన్ని రోజులు దాడులు అహంకారం తో పాలన చేస్తారు. ఎన్నో వాగ్దానాలు చేశారు ఎన్నో మోసాలు చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను హింసిస్తున్నారు. ఎక్కడ చూసినా కన్నీళ్లు కష్టాలే మిగిలాయి, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. ఈ అనిల్ కుమార్ యాదవ్ కు మేము ఈ రోడ్డు విస్తరణకి అడ్డు కాదు. కానీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు అ వాగ్దానాల మీద నిలబడాలి 9 అంకణాలు చోటిస్తాం, ఇల్లు కట్టిస్తాం తర్వాతే వచ్చి రోడ్డు విస్తరణ చేస్తామని మీరు చెప్పారు. కానీ ఈరోజు దారుణంగా వచ్చి ఇల్లులు,దుకాణాలు ధ్వంసం చేశారు. మీ పోలీస్ బలగాలతో వచ్చి పసిబిడ్డల్ని మహిళలను కూడా చూడకుండా కొట్టి రోడ్లమీద లాగి పడేశారు వాళ్ళ ఇల్లు కూల్చేశారు. మేము దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జనసేన పార్టీ నుంచి వీళ్ళకి అండగా ఉంటాం. తప్పకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. వీళ్ళకు తగు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులతో పాటు నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.