కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శెట్టిబత్తుల రాజబాబు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు, కందుల లక్ష్మీ దుర్గేష్ పుట్టినరోజు సందర్భంగా, అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజమండ్రి పార్టీ ఆఫీస్ లో దుర్గేష్ ని శాలువాతో సత్కరించి తెలుగు రాష్ట్ర ప్రజలు అందరి దీవెనలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సందడి శీనుబాబు, జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.