మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన శివబాలాజీ

బిగ్‌బాస్ సీజన్ 1 విజేత ప్రముఖ సినీ నటుడు శివబాలాజీ తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల కోసం వేధిస్తుంది అని ఆరోపించారు. ఫీజులు తగ్గించమని అడిగితే తన కుమారుడిని ఆన్లైన్ క్లాసుల నుండి అర్ధాంతరంగా డిస్ కనెక్ట్ చేసారు అని ఆరోపించారు శివబాలాజీ. ఇలా ఎందుకు చేసారు అని అడిగితే ఆస్కూల్ యాజమాన్యం ఇచ్చిన మెయిల్ లో అభ్యంతరకరంగా సమాధానం ఉంది అని శివబాలాజీ తెలిపారు. జీవో 46 ను ఉల్లంఘిస్తూ ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారని శివబాలాజీ అన్నారు. స్కూల్ ను సంప్రదించినా సరైన సమాధానం ఇవ్వడంలేదని శివబాలాజీ ఆరోపిస్తున్నారు. చాలా మంది తలిదండ్రులను ఇలానే ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిన ఆయన వారంతా బయటికి చెప్పడానికి భయపడుతున్నారు అని అన్నారు. కానీ ఇప్పుడు నేను ముందుకు వచ్చానని నేను ఈ విషయాన్ని వదిలిపెట్టను అని శివబాలాజీ తెలిపారు.